మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
     

 

Sri Bhadrakali Ashtottara Shatanama Stotram – శ్రీ భద్రకాళీ అష్టోత్తరశతనామ స్తోత్రం


శ్రీనందికేశ్వర ఉవాచ |
భద్రకాళీమహం వందే వీరభద్రసతీం శివామ్ |
సుతామ్రార్చితపాదాబ్జం సుఖసౌభాగ్యదాయినీమ్ || 1 ||

అథ స్తోత్రమ్ |
భద్రకాళీ కామరూపా మహావిద్యా యశస్వినీ |
మహాశ్రయా మహాభాగా దక్షయాగవిభేదినీ || 2 ||

రుద్రకోపసముద్భూతా భద్రా ముద్రా శివంకరీ |
చంద్రికా చంద్రవదనా రోషతామ్రాక్షశోభినీ || 3 ||

ఇంద్రాదిదమనీ శాంతా చంద్రలేఖావిభూషితా |
భక్తార్తిహారిణీ ముక్తా చండికానందదాయినీ || 4 ||

సౌదామినీ సుధామూర్తిః దివ్యాలంకారభూషితా |
సువాసినీ సునాసా చ త్రికాలజ్ఞా ధురంధరా || 5 ||

సర్వజ్ఞా సర్వలోకేశీ దేవయోనిరయోనిజా |
నిర్గుణా నిరహంకారా లోకకళ్యాణకారిణీ || 6 ||

సర్వలోకప్రియా గౌరీ సర్వగర్వవిమర్దినీ |
తేజోవతీ మహామాతా కోటిసూర్యసమప్రభా || 7 ||

వీరభద్రకృతానందభోగినీ వీరసేవితా |
నారదాదిమునిస్తుత్యా నిత్యా సత్యా తపస్వినీ || 8 ||

జ్ఞానరూపా కళాతీతా భక్తాభీష్టఫలప్రదా |
కైలాసనిలయా శుభ్రా క్షమా శ్రీః సర్వమంగళా || 9||

సిద్ధవిద్యా మహాశక్తిః కామినీ పద్మలోచనా |
దేవప్రియా దైత్యహంత్రీ దక్షగర్వాపహారిణీ || 10 ||

శివశాసనకర్త్రీ చ శైవానందవిధాయినీ |
భవపాశనిహంత్రీ చ సవనాంగసుకారిణీ || 11 ||

లంబోదరీ మహాకాళీ భీషణాస్యా సురేశ్వరీ |
మహానిద్రా యోగనిద్రా ప్రజ్ఞా వార్తా క్రియావతీ || 12 ||

పుత్రపౌత్రప్రదా సాధ్వీ సేనాయుద్ధసుకాంక్షిణీ |
ఇచ్ఛా శంభోః కృపాసింధుః చండీ చండపరాక్రమా || 13 ||

శోభా భగవతీ మాయా దుర్గా నీలా మనోగతిః |
ఖేచరీ ఖడ్గినీ చక్రహస్తా శూలవిధారిణీ || 14 ||

సుబాణా శక్తిహస్తా చ పాదసంచారిణీ పరా |
తపఃసిద్ధిప్రదా దేవీ వీరభద్రసహాయినీ || 15 ||

ధనధాన్యకరీ విశ్వా మనోమాలిన్యహారిణీ |
సునక్షత్రోద్భవకరీ వంశవృద్ధిప్రదాయినీ || 16 ||

బ్రహ్మాదిసురసంసేవ్యా శాంకరీ ప్రియభాషిణీ |
భూతప్రేతపిశాచాదిహారిణీ సుమనస్వినీ || 17 ||

పుణ్యక్షేత్రకృతావాసా ప్రత్యక్షపరమేశ్వరీ |
ఏవం నామ్నాం భద్రకాళ్యాః శతమష్టోత్తరం విదుః || 18 ||

పుణ్యం యశో దీర్ఘమాయుః పుత్రపౌత్రం ధనం బహు |
దదాతి దేవీ తస్యాశు యః పఠేత్ స్తోత్రముత్తమమ్ || 19 ||

భౌమవారే భృగౌ చైవ పౌర్ణమాస్యాం విశేషతః |
ప్రాతః స్నాత్వా నిత్యకర్మ విధాయ చ సుభక్తిమాన్ || 20 ||

వీరభద్రాలయే భద్రాం సంపూజ్య సురసేవితామ్ |
పఠేత్ స్తోత్రమిదం దివ్యం నానా భోగప్రదం శుభమ్ || 21 ||

అభీష్టసిద్ధిం ప్రాప్నోతి శీఘ్రం విద్వాన్ పరంతప |
అథవా స్వగృహే వీరభద్రపత్నీం సమర్చయేత్ || 22 ||

స్తోత్రేణానేన విధివత్ సర్వాన్ కామానవాప్నుయాత్ |
రోగా నశ్యంతి తస్యాశు యోగసిద్ధిం చ విందతి || 23 ||

సనత్కుమారభక్తానామిదం స్తోత్రం ప్రబోధయ |
రహస్యం సారభూతం చ సర్వజ్ఞః సంభవిష్యసి || 24 ||

ఇతి శ్రీభద్రకాళ్యష్టోత్తరశతనామ స్తోత్రమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.